చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘పీపుల్స్‌ ఫస్ట్‌’ పాలసీ!

జిల్లా కలెక్టర్ల రెండో సమావేశంలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Dec 12, 2024 at 6:50am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎస్‌హెచ్‌జిల బలోపేతం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మనం పెత్తందార్లం కాదు.. ప్రజా సేవకులం
  • హెల్దీ.. వెల్దీ.. హ్యాపీ మన నినాదం, లక్ష్యం
  • మానవీయ కోణంలో సమస్యల పరిష్కారం
  • వైసీపీ హయాంలో పోర్టులు, సెజ్‌లూ కబ్జాలే
  • 13న స్వర్ణాంధ్ర -2047 విజన్‌ డాక్యుమెంట్‌
  • పాలనలో మరింత వేగం పెంచుదాం
  • జిల్లా కలెక్టర్ల రెండో సమావేశంలో సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో ప్రతి అధికారీ పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్‌ ఫస్ట్‌’ అనేది మన విధానమని, ‘హెల్దీ -వెల్దీ -హ్యాపీ’ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలన్నారు. ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజావినతులు వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధామ్యాలు కావాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో రెండో జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి.. గడిచిన 6 నెలల పాలనపైనా, భవిష్యత్‌ ప్రణాళికలపైనా చర్చించారు.
మార్పు మొదలైంది.. వెలుగులు చూస్తున్నాం
ఆరు నెలల్లో మనమంతా రెండోసారి సమావేశమయ్యామని.. అయితే మొదటి సమావేశానికి రెండో సమావేశానికి స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. మొదటి సమావేశం నాటికి రాష్ట్రంలో చీకట్లు నెలకొనగా, అవి మెల్లిగా తొలగిపోయి రెండో సమావేశం నాటికి వెలుగు రావడం మొదలైందన్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాన్ని నడిపించడం సులభంగానే ఉంటుందని, విధ్వంస రాష్ట్రంలో పాలన సాగించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. గత ప్రభుత్వం రూ.పది లక్షల కోట్లపైనే అప్పులు- బకాయిలు మిగిల్చి వెళ్లడమే కాదు, రెండేళ్లపాటు రాష్ట్రానికి వచ్చే నిధులను ముందుగానే వాడేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితులనుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, సంక్షేమం-అభివృద్ధివైపు వడిగా అడుగులు వేస్తున్నామన్నారు. గత పాలకులు పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా చేశారని.. ఇలా అన్నింటినీ ఒకొక్కటిగా సరిదిద్దుతున్నామని.. ఇందులో జిల్లాల కలెక్టర్లు చురుకైన పాత్ర పోషించాలని చెప్పారు. పీ`4 పాలసీ, జీరో పావర్టీ, ఉద్యోగాలకల్పన, జనాభావృద్ధి, జలసంరక్షణ, వ్యవసాయంలో పెట్టుబడి నియంత్రణ `రైతులకు లాభాలు పెంచడం.. తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు.
కూకటి వేళ్లతో సహా తొలగించండి
గత ప్రభుత్వంలో భూ అక్రమాలు, లిక్కర్‌ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయి సాగు, డ్రగ్స్‌ సరఫరా, ఎర్రచందనం స్మగ్లింగ్‌, రేషన్‌ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా.. ఇలా అన్ని మూలాల్లోకి మాఫియా వెళ్లిపోయిందని.., ఇప్పుడు వాటిని కూకటివేళ్లతో సహా తొలిగించాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లపైనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడా గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకూడదని, ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసిన వారిని క్షమించొద్దని, విశ్వసనీయతను -నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకురావాలని ముఖ్యమంత్రి మార్గదర్శనం చేశారు.
నిరూపించుకునే అవకాశమిస్తున్నాం
పాలనలోనూ ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ రావాలని, ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాల కలెక్టర్లు ఒకరితో ఒకరు పోటీ పడితేనే ఫలితాలు ఆశించినట్టుగా వస్తాయన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు అందరికీ అవకాశం ఇస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాకు ఏడు నియోజకవర్గాలే ఉన్నందున పాలన సులభతరమేనని, మానవ వనరుల అభివృద్ధినుంచి శాంతి భద్రతల అమలు వరకు అన్నింటా సమర్ధత చూపాలన్నారు. డబ్బులు లేవని అభివృద్ధి పనులు ఆపొద్దని, వినూత్నంగా ఆలోచించి ముందుకు సాగాలని, వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి పరిపూర్ణత రావాలన్నారు. పనిచేయని వాళ్లతో పనిచేయించాలని.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు సూచించారు.
మారిన పరిస్థితులతో భారీగా పెట్టుబడులు
అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై ఏటు శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. 20 పాలసీలు తెచ్చామని, ఇవన్నీచూసి రూ.4 లక్షల కోట్లవరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 4 లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయని సీఎం చంద్రబాబు వివరించారు. అమరావతి అభివృద్ధికి రూ.31 వేల కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామాల్లో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు.
పింఛన్ల పంపిణీలో మనదే రికార్డు
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా 64 లక్షలమంది పేదలకు పింఛన్లు ఇస్తున్నామని, ఏటా 33 వేల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నట్టు సీఎం ప్రస్తావించారు. దీపం-2 కింద ఇప్పటికే 40 లక్షల సిలండర్లు పేద కుటుంబాలకు అందించామన్నారు. రాష్ట్రంలో 199 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. 43 వేల పాఠశాలల్లో కోటి 20 లక్షల మందితో నిర్వహించిన పేరెంట్స్‌ `టీచ్చర్స్‌ మీటింగ్‌ విజయవంతమైందని, 16 వేలకుపైగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
రెవెన్యూ సదస్సులతో శాశ్వత పరిష్కారం
ప్రజల నుంచి మనకు వచ్చే వినతుల్లో అత్యధికంగా 60 శాతం భూసంబంధితమైనవే ఉంటున్నాయని, అందుకే భూ సమస్యలు పరిష్కరించేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేసి.. ల్యాండ్‌ గ్రాబింగ్‌ ప్రొహిబిషన్‌ యాక్టు తెచ్చినట్టు సీఎం చంద్రబాబు వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పదేపదే అర్జీలు పట్టుకుని తిరిగే పరిస్థితి పోవాలని, బాధిత వర్గాలకు ఎలా న్యాయం చేయాలనేది అధికారులు ఆలోచించి పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రస్తుతం పని చేస్తున్న విధానంతో మార్పురాదని, తనకు వచ్చిన అర్జీని ఆర్డీవో తాసీల్దార్‌కు పంపితే సమస్య పరిష్కరించినట్లు కాదన్నారు. సంతృప్తికరమైన పరిష్కారం చూపితేనే ప్రజల నుంచి సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుందన్నారు.
సంక్రాంతికల్లా రహదారుల మరమ్మతులు
ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, 48 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఐదేళ్లలో పాడైన రోడ్లన్నింటికీ మరమ్మతులు చేస్తున్నామని.. సంక్రాంతికల్లా గుంతలు పూడుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. గూగుల్‌ సాయంతో విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును కనుగొన్నామని, సాయిల్‌ టెస్టింగ్‌, సాయిల్‌ హెల్త్‌వంటి వాటికీ టెక్నాలజీ సాయం తీసుకుంటామన్నారు.
స్వర్ణాంధ్ర `2047 విజన్‌తో పాలన
స్వర్ణాంధ్ర విజన్‌ `2047ను ఈనెల 13న ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీస్థాయిలో విజన్‌ రూపొందించామని.. దాని ఆధారంగా పాలన సాగాలన్నారు. 15 శాతం వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా, మంత్రులు హాజరయ్యారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

మత్స్యకారులకు అండగా ఉంటాం

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

Previous Post

ప్రతి సమస్యా పరిష్కరించాల్సిందే

Next Post

ఎనర్జీ హబ్‌గా ఏపీ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-06-2026

కార్యకర్త
@ June 25, 2026
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!
ఆంధ్రప్రదేశ్

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!
ఆంధ్రప్రదేశ్

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!
ఆంధ్రప్రదేశ్

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-06-2026

కార్యకర్త
@ June 24, 2026
రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి
ఆంధ్రప్రదేశ్

రాయలసీమలో ‘పసిడి’ పంట స్వర్ణగిరిగా… ఇక జొన్నగిరి

చైతన్యరధం
@ June 24, 2026
గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’
ఆంధ్రప్రదేశ్

గేట్లు సిద్ధం.. తుంగ‘భద్రం’

చైతన్యరధం
@ June 24, 2026
Load More

ముఖ్య వార్తలు

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

ఇక ప్రోగ్రెస్ రిపోర్టులు!

చైతన్యరధం
@ June 22, 2026
అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

అంగన్వాడీ కేంద్రానికి ఇండక్షన్ స్టవ్ లు

చైతన్యరధం
@ June 21, 2026

రైతుకు ప్రజాప్రభుత్వం అభయం 

చైతన్యరధం
@ June 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

మత్స్యకారులకు అండగా ఉంటాం

చైతన్యరధం
@ June 25, 2026
జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

జొన్నగిరి.. ఇకపై స్వర్ణగిరి!

చైతన్యరధం
@ June 25, 2026
కార్తకర్తే.. అధినేత!

కార్తకర్తే.. అధినేత!

చైతన్యరధం
@ June 25, 2026
ఇక విద్యా విప్లవం!

ఇక విద్యా విప్లవం!

చైతన్యరధం
@ June 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist