ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం తరచూ వ్యక్తుల హక్కులను ఉల్లంఘిస్తూ బాబా సాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తోంది. ఈ స్థితిలో వ్యక్తులు తమ హక్కులను కాపాడుకునేందుకు రాజ్యాంగంలో ఆర్టికల్ 226 కింద కొన్ని పరిహారాలను నిర్దేశించారు. ప్రభుత్వమే రాజ్యాంగ ఉల్లంఘలకు పాల్పడిన సందర్భాల్లో పౌరులకు రాజ్యాంగం ఉపశమనం కలిగిస్తుంది. న్యాయసమ్మతం కాని పరిపాలనా చర్య వల్ల ఒక వ్యక్తి/వ్యక్తుల యొక్క హక్కులు ఉల్లంఘనకు గురైనపుడు ఆ వ్యక్తి ఉపశమనం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. పరిపాలన శాసనం బాధితుడైన వ్యక్తికి వ్యతిరేకంగా ఉన్నపుడు పలు ఉపశమనాలు కల్పించబడ్డాయి. గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి ప్రభుత్వం వ్యక్తుల హక్కులను కాలరాసిన పలు సందర్భాల్లో న్యాయస్థానాలు మొట్టికాయలు వేశాయి.
1.సిఆర్ డిఎ చట్టాన్ని రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని, చట్టంలో ఉన్నవిధంగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాష్ట్రప్రభుత్వానికి శరాఘాతం లాంటిది.
2.రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపు, భారీ పోలీసు కవాతు, ఆందోళనల్లో పాల్గొన్న మహిళలను బూటుకాలితో తన్నడం, మగపోలీసులు మహిళలను అరెస్ట్ చేయడంపై హైకోర్టు ఆగ్రహం. (17-1-2020).
3.పార్లమెంటులో పిఎం ఫోటోలేదు… హైకోర్టుల్లో సిజె ఫోటోలు లేవు… కానీ ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయితీ భవనాల్లో ముఖ్యమంత్రి ఫొటో ఎందుకు? -హైకోర్టు సూటిప్రశ్న. (5-2-2020).
4.రేషన్ వాహనాలపై పార్టీ గుర్తులు, రంగులు, నేతల ఫోటోలు తొలగించాలని హైకోర్టు ఆదేశం. (31-1-2021).
5.మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజును కొనసాగించాలని ఎపి హైకోర్టు ఆదేశం – చైర్మన్ నియామకంపై స్టే కోరుతూ వేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసిన న్యాయస్థానం. (11-8-2021).
ఆర్టికల్-32/ ఆర్టికల్-226 యొక్క పరిధి
1.ఆర్టికల్ 32 కింద హక్కు హామీ, ప్రాథమిక హక్కుల అమలుకు మాత్రమే వినియోగించబడుతుంది. ఆర్టికల్ 226 కింద ప్రాధమిక హక్కుల అమలుకు మరియు ఏదేని ఇతర అవసరాలకు కూడా వినియోగించవచ్చు.
2.ఆర్టికల్ 32కింద సుప్రీంకోర్టు అధికార పరిధి దాని మూలనిర్మాణంలో అంతర్భాగం. ఆర్టికల్ 226 కింద హైకోర్టు చేత న్యాయపర సమీక్ష, పరిపాలనా ట్రిబ్యునళ్లు మరియు ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించి దాని మూల నిర్మాణంలో భాగం.
3.ఆర్టికల్ 32 అనేది ఒక ప్రాథమిక అనేది ఒక ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 226 ప్రాథమిక హక్కు కాదు.
ఉపశమనానికి సంబంధించిన రిట్లు
ఎ. హెబియస్ కార్పస్ రిట్
ఒక వ్యక్తి చట్టవిరుద్దంగా నిర్బంధానికి గురైనపుడు అతడు లేదా ఆమె సంబంధీకులు లేదా స్నేహితులు హైకోర్టులో ఆర్టికల్ 226కింద, లేదా సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32కింద హెబియస్ కార్పస్ రిట్ కింద పిటిషన్ దాఖలు చేయవచ్చు. సంబంధిత న్యాయస్థానం ఆ వినతిలోని విషయాలు పరిశీలించి సంతృప్తి చెందినపుడు హెబియస్ కార్పస్ రిట్ జారీచేస్తుంది.
బి. మాండమస్ రిట్
లాటిన్ భాషలో ‘‘మాండమస్’’ అంటే మేము ఆదేశిస్తున్నాము అని అర్థం. మాండమాస్ అనేది ఒక ఆజ్జరూపంలో ఇచ్చే న్యాయ ఆదేశం. ఒక చట్టబద్ధ లేదా చట్టబద్ధతలేని సాధికార సంస్థ/ అధికారికి, చట్టం చేత ధారాదత్తం చేయబడిన పౌరవిధిని నిర్వర్తించడానికి లేదా ఒక నిర్దేశించిన చర్యను నిర్వర్తించరాదని అని దేనిని, ఆ సాధికార సంస్థ/ వ్యక్తి చట్టప్రకారం నిర్వరించకూడదో అది, ఒక పరపాలన చర్య ఇష్టానుసారం వినియోగాన్ని నియంత్రించడానికి ఇచ్చే ముఖ్యమైన రిట్ గా వర్ణించవచ్చు. దీనిని రిట్ ఆఫ్ జస్టిస్‌గా పిలుస్తారు.
సి.సెర్ టీ యొరారి రిట్
ఈ రిట్ ద్వారా సుప్రీంకోర్టు/హైకోర్టు, దిగువకోర్టుల నిర్ణయాలు చట్టరాహిత్యాన్ని (ఱశ్రీశ్రీవస్త్రaశ్రీఱ్‌వ) సరిదిద్దే అధికారం ఇస్తుంది.
డి. ప్రొహిబిషన్ రిట్
ప్రొహిబిషన్ రిట్ ను ఒక పరిపాలన నిర్ణయం లేదా పరిపాలనా చర్యల అమలును నిలిపివేయడానికి ఇస్తారు.
ఈ. రిట్ ఆప్ కోవారెంటు
ఈ రిట్ ఒక పదవిని కలిగిఉన్న వ్యక్తికి ఆ పదవిని పొందే అధికారాన్ని ప్రశ్నిస్తుంది. కో వారంటు అంటే ‘‘ఏ అధికారం చేత’’ అని అర్థం. అది ఒక న్యాయ ఆదేశం. ఒక వ్యక్తిని, ఒక ప్రభుత్వ పదవిని అలంకరించి ఉన్నారో, వారు ఏ అధికారం చేత ఆ పదవిని పొందారో చూపమని కోరుతుంది. పదవిని కలిగిన వ్యక్తి దానికి అర్హులు కాదని కనుగొనబడినపుడు కో వారెంట్ రిట్ ద్వారా వారిని ఆ పదవికి తొలగించే అవకాశం ఉంది.
అప్పీలు యొక్క పరిమితి (స్పెషల్ లీవ్ పిటిషన్) (రాజ్యాంగం ఆర్టికల్ 136 కింద)
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 136, సుప్రీంకోర్టుకు, ఏదేని కోర్టు లేదా ట్రిబ్యునల్ చేత ఇవ్వబడిన తీర్పు డిక్రీ నిర్ణయం, శిక్ష లేదా ఆదేశాన్ని ప్రశ్నించడానికి ప్రత్యేక అనుమతినిచ్చే అధికారాన్ని ఇస్తుంది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించడానికి అధికారం కలిగి ఉంటుంది.
II సివిల్ చట్టం కింద ఉమశమనాలు
1.ఇంజక్షన్ (నిషేధ ఉత్తర్వు)
నిషేధ ఉత్తర్వు అనేది ఒక న్యాయస్థానం ఒక ప్రతివాదిని, ఒక సకరాత్మక చర్య లేదా వాదికి బాధకలిగించే నిషేధ చర్య తీసుకోవడానికి, కొనసాగించడాన్ని ఆపడానికి ఇచ్చు ఆదేశం. ఆ ఆదేశం తాత్కాలికం లేదా శాశ్వతం కావచ్చు.
2. డిక్లరేషన్ (ప్రకటన)
కోర్టు చేత, సంబంధిత పార్టీల యొక్క హక్కులను, మరింత సహాయం ఇవ్వకుండా ప్రకటించబడటాన్ని ప్రకటనగా చెప్పొచ్చు.
3.నష్ట పరిహారాలు
నష్టపరిహారం అంటే ధనరూపంలో కొంత సహాయాన్ని, పరిహారాన్ని సంబంధిత వాది జరిగిన నష్టానికి అర్హుడో దానిని నిర్దేశిస్తుంది. నష్టపరిహారాలు అనేక రకాలు ఉంటాయి. వాటిలో 1. ధిక్కార పరిహారం 2. నామమాత్ర పరిహారం. 3. పరిసమాప్తి నష్టపరిహారం. 4. పరిసమాప్తం కాని నష్టపరిహారాలు.
ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్లు, జిఓలు, సర్క్యులర్లతోపాటు ప్రభుత్వాధికారులు, ఇతర అథారిటీల నిర్ణయాలు, వారి చర్యలను 226 కింద ప్రశ్నించే అధికారం కల్పించబడిరది. దీనిద్వారా బ్యూరోక్రసీ దుశ్చర్యలు, కక్షసాధింపు, అవకతవకలకు కళ్లెం వేసే అవకాశం లభిస్తుంది. ప్రజలు చైతన్యవంతులై అవసరమైనపుడు ఈ ఉపశమనాలను వినియోగించు కోవాల్సిందిగా టిడిపి న్యాయవిభాగం సూచిస్తోంది.
( తెలుగుదేశం పార్టీ న్యాయవిభాగం)