మెజారిటీ పై దృష్టి సారించిన టిడిపి అధినాయకత్వం
ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఛైర్మన్ గా సమన్వయ కమిటీ ఏర్పాటు
నియోజకవర్గ ఇంచార్జ్ గా డాక్టర్ పి ఎస్ మునిరత్నం
కన్వీనర్ గా ఆర్ చంద్రశేఖర్
కార్యాచరణ విడుదల చేసిన అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిద్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పై అధికార పార్టీ పలికే డాంబికాలకు చెక్ పెట్టె విధంగా టిడిపి ప్రణాళిక సిద్ధం చేసింది. వై నాట్ కుప్పం అని అధికార పార్టీ నాయకులు చేస్తున్న నినాదానికి దీటుగా వైనాట్ పులివెందుల అంటూ టిడిపి ఎమ్మెల్సీ ఎన్నికలలో దీటుగా జవాబు ఇచ్చింది. తాజాగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు లక్ష ఓట్ల మెజారిటీ తీసుకు రావాలని టిడిపి శ్రేణులు పట్టుదలతో వున్నాయి. అందుకు అనుగుణంగా పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేపట్టారు. కుప్పం నియోజకవర్గ స్థాయిలో ఇప్పటివరకు వున్న సమన్వయ కమిటీ స్థానంలో నూతన కమిటీని నియమించారు.
కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ను నియమించినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు గురువారంమీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గ ఇంచార్జ్ గా డాక్టర్ పి ఎస్ మునిరత్నం, కమిటీ కన్వీనర్ గా ఆర్ చంద్రశేఖర్ లు నియమితులయ్యారు.సభ్యులుగా గౌనివాని శ్రీనివాసులు (మాజీ ఎమ్మెల్సీ), పి మనోహర్ ( చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి), డి ఎస్ త్రిలోక్ (కుప్పం మునిసిపల్ ఛైర్మన్ అభ్యర్ధి), జి ఏం రాజు (మాజీ ఎంపిపి), సాంబశివన్ (మాజీ ఎంపిపి), సత్యేంద్ర శేఖర్ (మాజీ ఎఎంసీ ఛైర్మన్), విజి ప్రతాప్ కుమార్ (మాజీ సర్పంచ్), రాజగోపాల్, డాక్టర్ వెంకటేష్ (మాజీ ఎంపిపి), ఎం మని, జకీర్, ఆనందరెడ్డి (రామకుప్పం మండల కమిటీ అధ్యక్షులు), విశ్వనాధ నాయుడు (శాంతిపురం మండల కమిటీ అధ్యక్షులు), టి ఏం బాబునాయుడు (గుడుపల్లి మండల కమిటీ అధ్యక్షులు), ప్రేమ్ కుమార్ (కుప్పం మండల కమిటీ అధ్యక్షులు), రాజ్ కుమార్ ( కుప్పం పట్టణ కమిటీ అధ్యక్షులు), ఈ విజయరామిరెడ్డి (క్లస్టర్ ఇంచార్జీ), ఎన్ చంద్రశేఖర్ (క్లస్టర్ ఇంచార్జీ), రవి (క్లస్టర్ ఇంచార్జీ), హెమాంబర్ గౌడ్ (క్లస్టర్ ఇంచార్జీ), మునుస్వామి (క్లస్టర్ ఇంచార్జీ), మహమ్మద్ రఫీ (క్లస్టర్ ఇంచార్జీ), ఏవి రవి (క్లస్టర్ ఇంచార్జీ), మహేంద్ర (క్లస్టర్ ఇంచార్జీ), రామచంద్ర (క్లస్టర్ ఇంచార్జీ), బేటప్ప నాయుడు (మాజీ జెడ్పీటీసీ), ఉదయ్ కుమార్ (మాజీ వైస్ ఎంపిపి), ఆనజనేయ రెడ్డి (మాజీ ఎంపిపి), ఎస్ చౌడప్ప ( ఎక్స్ ఎంపిపి), వి శాంతారాం, నాయీబ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్), ఎస్ వెంకటేష్ (యూనిట్ ఇంచార్జీ, కుప్పం టౌన్) లను నియమించారు.
అదేవిధంగా కుప్పం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా గుడుపల్లి మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన టి వెంకటేష్ నియమితులయ్యారు. కుప్పం పట్టణంలో పార్టీ బలోపేతానికి కోర్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో పట్టణ అధ్యక్షులు ఎస్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి కె ఆర్మూగం తో పాటు ఆరుగురు కౌన్సిలర్ లు విజి ప్రతాప్ కుమార్, కణ్ణన్, సాంబశివన్, డాక్టర్ వెంకటేష్, త్రిలోక్ లు సభ్యులుగా వున్నారు. సమర్ధత, సామాజిక సమతౌల్యం కోసం పార్టీ పట్టణ, మండల కమిటీలు, అనుబంధ సంఘాల నాయకత్వంలో అవసరమైన మార్పులు చేసే అధికారాన్ని సమన్వయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కు అప్పగించారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులలో వున్న నాయ్కులు, వారి బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ, పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలని అచ్చెన్నాయుడు సూచించారు.