- సుదీర్ఘంగా వివాదంలోని రూ.5వేల కోట్ల విలువైన 31 వేల ఎకరాలకు విముక్తి
- ఏపీకి వచ్చే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా నైపుణ్య శిక్షణ
- పీఎం సూర్యఘర్ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయండి
- 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో భూముల వివాదాలను పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో చాలా భూములు వివాదాల్లోకి వెళ్లాయని… వాటిని పరిష్కరించడంతో పాటు శతాబ్ద కాలం నుంచి వివాదంలో ఉన్న భూ సమస్యలను సైతం పరిష్కరిస్తున్నామని చెప్పారు. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 232 సుదీర్ఘ కాలం పెండింగులో ఉన్న భూ వివాదాలను క్లియర్ చేశామని.. వీటి విలువ సుమారు రూ.5వేల కోట్లు ఉంటాయని.. మొత్తంగా సుదీర్ఘంగా వివాదంలో ఉన్న 31వేల ఎకరాలకు విముక్తి కల్పించామని సీఎం చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండో రోజైన శుక్రవారం రెవెన్యూ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పురపాలక, విద్యుత్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… “వివిధ జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోండి. అంబాజీపేటలో గ్రౌండ్ రెంట్ భూముల అంశం 120 ఏళ్ల కాలం నాటి సమస్య. అలాంటిదాన్ని పరిష్కరించగలిగాం. ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఈ వ్యవహారాల్లో ఎక్కడా అవినితి లేకుండా భూ సమస్యల్ని పరిష్కరించాలి. మంత్రులు, అధికారులు కూడా ఈ సమస్యల్ని పరిష్కరించిన విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. రీ సర్వే ప్రక్రియ పూర్తైన భూములకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో భద్రత కల్పించాలి. నవంబరు 1వ తేదీ నుంచి రియల్ _టైమ్లో ఇంటిగ్రేషన్ చేయండి. రెవెన్యూ సమస్యల పరిష్కారం… ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల గురించి ప్రజలకు వివరించాలి.” అని చెప్పారు.
నిరంతరాయంగా నైపుణ్యాభివృద్ధి
“రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో యువత ఉంటారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం నిరంతర ప్రక్రియ. పీఎం సేతు కార్యక్రమాన్ని విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకూ విస్తరించి యువతకు మరిన్ని నైపుణ్యాలు కల్పించాలి. పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ నిధులతోనూ ఈ నైపుణ్యాలను కల్పించే అంశాన్ని పరిశీలించండి. ఏపీకి వచ్చే పరిశ్రమల్లో నైపుణ్యం ఉన్న మన యువతే ఉద్యోగాలు పొందేలా కార్యాచరణ చేపట్టాలి. నియోజకవర్గాల వారీగా జాబ్ ఫెయిర్లు నిర్వహించాలి. ఇప్పటిదాకా 4.98 లక్షల మంది యువత నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నైపుణ్య కల్పనపై ప్రజల్లో కూడా విస్తృత అవగాహన కల్పించాలి. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పన జరగాలంటే వారికి నైపుణ్యాల్నిపెంచాల్సిన అవసరం ఉంది. నైపుణ్యాభివృద్ధి విషయంలో యువతకు ఎలాంటి నైపుణ్యాలు అవసరమో గుర్తించాలి. ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు పరిశ్రమల్ని కూడా అనుసంధానించి అవసరమైన నైపుణ్యాలు పొందేలా చూడాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోనూ విద్యార్థులు నైపుణ్యం సాధించేలా చూడాలి.
‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా 2027 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలి. స్కూల్ బిల్డింగ్ సేఫ్టీపై ఆడిటింగ్ నిర్వహించి వాటిని సురక్షితంగా మార్చేలా చర్యలు చేపట్టాలి. లిటరేట్ లెర్న్లోడ్ స్టేట్గా ఏపీ మారాలి. స్వచ్ఛవాయు సర్వేక్షణ్ గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో స్థానం. నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్ గా గుంటూరు, విజయవాడలోని వార్డులకు అవార్డులు వచ్చాయి. రూ.1.05 కోట్ల నగదు ప్రోత్సాహంతో పాటు… జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు ఈ ఏడాది ఏపీలోని నగరాలు దక్కించుకున్నాయి. గుంటూరు, ఏలూరు,
విజయనగరం, విజయవాడ, నెల్లూరు, శ్రీకాకుళం, చిత్తూరు నగరాల్లో అత్యుత్తమ పని తీరు ఉంది. ప్రతినెలా ఒక రోజు సంజీవని కార్యక్రమం ద్వారా వైద్యారోగ్య పరిరక్షణపై క్షేత్రస్థాయికి వెళ్తున్నాను. ప్రజల ఆరోగ్యం అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.
విద్యుత్ డిమాండ్ తీర్చేలా ప్రత్యామ్నాయ పద్ధతులు
“కలెక్టర్లు సోలార్ రూఫ్ప్ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎంత ఎక్కువ ఇన్స్టలేషన్లు జరిగితే.. విద్యుత్ ఉత్పత్తిపై అంత ఒత్తిడి తగ్గుతుంది. కేంద్రం ఈ పథకం ద్వారా ఇస్తున్న సబ్సిడీ ప్రజలకు అందేలా చూడాలి. ‘పీఎం కుసుమ్’ పథకం కింద కూడా వ్యవసాయ కనెక్షన్లకు సౌర విద్యుత్ ఏర్పాటు చేయండి. పాఠశాల భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలి. 28 జిల్లాల్లో 2,932 భవనాలపై 47 మెగావాట్ల సోలార్ రూప్టాప్ ప్యానళ్లు ఏర్పాటు చేయండి. ఇంటింటికీ సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు కలెక్టర్లు సహకరించాలి. విద్యుత్ డిమాండ్ను తీర్చేలా పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సహా వివిధ ప్రత్యామ్నాయాలకు వెళ్తున్నాం. ప్రతి ఇంటిపైనా విద్యుత్ ఉత్పత్తి జరిగితే సరఫరా, పంపిణీ నష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. 2025-26 ఏడాదిలో సగటు విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్కు రూ.4.97కి తగ్గించాం. ప్రతి యూనిట్కు 23 పైసల మేర పొదుపు చేయగలుగుతున్నాం. గడచిన రెండేళ్లుగా విద్యుత్ వినియోగదారులకు ఎలాంటి టారిఫ్ పెంచలేదు.” అని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.









