గుంటూరు: వాలంటీర్ల మీద కాదు.. వారి చేత పని చేయిస్తున్న వైసీపీ నేతలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి రామాంజనేయులు డిమాండ్ చేశారు. తనపై దాడిచేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. వైసీపీ అభ్యర్థి కిరణ్ ప్రలోభాలకు గురి చేస్తూ వాలంటీర్ల ద్వారా డబ్బులు పంచు తున్నారు.. ఇది తెలుసుకొని అక్కడకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తే తనపై దాడి చేశారన్నారు. ప్రలోభాలకు గురి చేస్తున్న ప్పుడు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. పోలీసుల ముందే తమపై మరోసారి దాడికి యత్నించారని రామాంజనేయులు ఆరోపించారు.
ఎస్సీకి టీడీపీ, జనసేన నేతల ఫిర్యాదు
ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, కార్యకర్తలపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఆతర నేతలు దాడి చేసిన ఘటనపై టీడీపీ, జనసేన నేతలు గురువారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశా రు. దాడిచేసిన వారిపై చర్యలుతీసుకోవా లని విజ్ఞప్తి చేశారు. వాలంటీర్లకు కాను కలు, డబ్బు పంపిణీ అంశాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ ఆఫీసుకు వచ్చిన వారిలో టీడీపీ నేతలు తెనాలి శ్రావణ్‌కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, రామాంజనేయులు,పిడుగురాళ్ల మాధవి, జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.
దాడిచేసి మా పైనే కేసులు
తమ అభ్యర్థిపై దాడి చేసి తిరిగి తమ పైనే కేసులు పెడుతున్నారని టీడీపీ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టా లన్నారు. దాడులు అంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని పోటీసు అధికారులను కోరారు.
భయపెట్టేందుకే: ఆలపాటి
ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోం దని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు.మరోసారి దాడికి యత్నిస్తే ఇంతకు ఇంత ప్రతిఘటన ఉంటుందన్నారు. ప్రజలే తిరగబడతా రని హెచ్చరించారు.