రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలైన 29 మందిని ఫిన్‌లాండ్ పర్యటనకు పంపించింది ఏపీ ప్రభుత్వం
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విద్యా విధానాలు, వినూత్న బోధనా పద్ధతులపై ఉపాధ్యాయులకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం, తద్వారా రాష్ట్రంలో బోధన, అభ్యాస నాణ్యతను పెంపొందించాలనే విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ లక్ష్యం మేరకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలైన 29 మందిని ఫిన్‌లాండ్ పర్యటనకు పంపించింది ఏపీ ప్రభుత్వం. 'టర్కు యూనివర్సిటీ' (University of Turku)లో పిల్లల-కేంద్రీకృత అభ్యాసం, ఆనందదాయక బోధనా విధానం, ఆటల ఆధారిత విద్య, వినూత్న తరగతి గది పద్ధతులను ఉపాధ్యాయ బృందం శిక్షణ తీసుకుంటుంది.