- కుంభకోణాల్లో ఇరుక్కుని దుష్ప్రచారం
- జగన్ సతీసమేతంగా తిరుమలకు రాలేదే..
- నేను ప్రశ్నించినందుకే బురదచల్లే ప్రయత్నం
- భూమన దొంగ అని ప్రపంచమంతా తెలుసు
- సుబ్బారెడ్డి, ఆయన ఆటలు ఇక సాగవు
- పాత ఫొటోలు, వీడియో మార్ఫింగ్ చేస్తున్నారు
- తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని వదిలిపెట్టను
- టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు
తిరుపతి(చైతన్యరథం): సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచా రం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. ఆదివారం మీడియా సమావే శంలో వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని ఖండించారు. నన్ను రాజీనామా చేయాలని భూమన అంటున్నాడు.. రాజీనామా చేయమనడానికి ఆయనెవరు? ఆయన దుర్మార్గాలన్నీ నాకు తెలు సు. వారు ప్రచారం చేస్తున్న వీడియోల్లో అశ్లీలం ఏముంది? వాళ్ల ఫ్యామిలీతో మాకు 30 ఏళ్లుగా పరిచయాలు ఉన్నాయి. వాళ్లు మా ఇంటికి వస్తారు..మేము వాళ్ల ఇంటికి వెళతాం. కొన్ని చోట్ల మార్ఫింగ్ చేసి ఏదో చూపించాలని ప్రయత్నం చేశారు. సన్నాసు లకు సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయటం రాలేదు. వీడియోలో కాకుండా చూపించిన ఆ ఫొటోలు ఎప్పుడో 20 ఏళ్ల నాటివి.. అందులో అశ్లీలం ఎక్కడ ఉంది? అన్నీ మిక్స్ చేసి ఫేక్ చేశారు.
ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలవరా? ఆ ఫొటోలు, వీడియోలు తెచ్చి మిక్స్ చేశారు..మీ ఇళ్లకు ఫ్రెండ్స్ రారా? మీరు వెళ్లరా? అందులో వల్గారిటీ ఏముంది? అని ప్రశ్నించారు. జగన్ సతీ సమేతంగా తిరుమలకు ఎందుకు రాలేదని ప్రశ్నించా.. హిందూ ధర్మ ప్రకారం ప్రశ్నించినందుకే నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సుబ్బారెడ్డికి, భూమన మద్రాస్ వెళ్లి మీరు ఏం చేశారో నాకు తెలుసు..అవన్నీ బయట పెట్టమంటారా.. నాపై దుష్ప్రచారం చేసిన వారిపై లీగల్‌గా పోరాడతా..డైవర్షన్ రాజకీ యాలు వారికి అలవాటే..వారి బెదిరింపులకు భయపడేది లేదని హితవుపలికారు. తిరుమలను ప్రక్షాళన చేయాలనే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నా. వన్‌మెన్ కమిషన్‌ను డైవర్ట్ చేసేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తన జోలికి వస్తే భూమన తోలు తీస్తానని హెచ్చరించారు. వారి ఆటలు సాగవని హెచ్చరించారు.













