- ఆన్లైన్లోనే బుకింగ్..ఓటీపీ ఉంటేనే పంపిణీ
- ఆందోళనతో ఎక్కువ మంది బుక్ చేస్తున్నారు
- కుటుంబ అవసరాలకు లోటు లేదు
- మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు
అమరావతి(చైతన్యరథం): గ్యాస్ సరఫరా విషయంలో పరిస్థి తులను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ మార్గాల వైపు కూడా దృష్టి సారించి ముందుకెళుతున్నట్లు చెప్పారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు శని వారం అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మంత్రి పయ్యావుల మాట్లాడుతూ “ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అందరూ సహక రించాలి. ఆందోళనతో ఎక్కువమంది గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తు న్నారు. కుటుంబ అవసరాలకు ఏమాత్రం లోటు లేకుండా చేయ డానికే మా తొలి ప్రాధాన్యం. పైప్డ్ గ్యాస్ కంపెనీలతోనూ సమా వేశమవుతాం. సిలిండర్ బుకింగ్ ఆన్లైన్లోనే ఉండాలని స్పష్టం చేశాం.
సిలిండర్ కావాలంటే ఓటీపీ ఉంటేనే ఇస్తారు. బ్లాక్ మార్కెటింగ్ కు తరలిపోకుండా ఓటీపీ పద్ధతిలోనే సిలిండర్ ఇస్తారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినట్లు తేలితే కఠిన చర్యలు తీసు కుంటామని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. రిఫైనరీల్లో గ్యాస్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని, వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఆసుపత్రులు, హాస్టళ్లకు గ్యాస్ సరఫరాకు అంతరా యం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాస్థాయిలోనూ పరిస్థితిని సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పైప్డ్ గ్యాస్ వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. వదంతులు నమ్మ వద్దని ప్రజలకు ప్రభుత్వ విజ్ఞప్తి చేశారు.














