అమరావతి (చైతన్య రథం): చేనేతలు తమ ఆత్మబంధువులని చెప్పే మంత్రి, యువనేత నారా లోకేష్ వారిపై తమ అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్ ఇచ్చిన మరో హామీని ప్రజాప్రభుత్వం నెరవేర్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా చేనేతలు పడుతున్న కష్టాలను చూసిన లోకేష్ చలించిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక మగ్గాలున్న చేనేతలకు ఉచిత విద్యుత్ ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ మాట మేరకు నేతన్నలకు ఏపీ ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం… బుధవారంనుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.














