- మావిగన్ పేరు విని ప్రజలు నవ్వుకుంటున్నారు
- అమరావతి ఆర్థిక శక్తితో అభివృద్ధికి బాటలు
- స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
అరకు(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం లో అమరావతి పునర్నిర్మాణం విజయపథంలో సాగుతోందని స్త్రీ శిశు సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. అమరా వతికి చట్టబద్దత కల్పించడంపై ఆదివారం విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గత వారంరోజులుగా 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసు కుంటున్నారు. అమరావతి చట్టబద్ధత విషయంలో దేశంలోని 50కి పైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలిపితే కేవలం వైసీపీ మాత్రమే వ్యతిరేకించి సభ నుంచి వాకౌట్ చేసింది. రాష్ట్ర విధ్వంసమే వారి లక్ష్యం. మూడు రాజధానుల పేరుతో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని కుట్రలు చేశారు.. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ప్రజలు జగన్‌రెడ్డి వైఖరి చూసి నవ్విపోతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని నమ్మి 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు.. రైతుల కష్టాలు తీరాయి.. ప్రజల ఆకాం క్ష అమరావతి అని స్పష్టం చేశారు.
















