అమరావతి (చైతన్య రథం): “నీ ప్రతిభ, బోర్డుపై నువ్వు చూపించే ఆధిక్యం.. తరువాతి తరాల గుండెల్లో ధైర్యం నింపాలి” అని చెస్ క్రీడాకారిణి వైశాలిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెడుతూ.. “మహిళల క్యాండిడేట్స్ విభాగంలో విజయం సాధించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశం పొందిన ఆర్ వైశాలికి అభినందనలు. ఫైడ్ ఉమెన్ క్యాండిడేట్స్ 2026లో జూ వెన్‌జున్‌తో తలపడనున్న నేపథ్యంలో, శుభాకాంక్షలు. బోర్డుపై నువ్వు ప్రదర్శించే ప్రతిభ, కొత్తతరం యువ భారతీయులను పెద్ద కలలు కనడానికి, ధైర్యంగా ఆలోచించడానికి ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు.














