- శరవేగంగా పోలవరం ఎడమ కాలువ పనులు
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
కాకినాడ(చైతన్యరథం): కూటమి ప్రభుత్వం చెప్పింది చేస్తుం ది.. చేసేదే చెబుతుంది..ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటుం దని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపా రు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులను శనివారం అన్నవరం సమీపంలోని పంపా ఆక్విడెక్టు, తుని మండలంలోని కుమ్మరిలోవ, తదితర ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. తునిలో ఈ కాల్వ పనులకు సంబంధిం చిన ఇంజనీరింగ్ నిపుణులు, అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆయన పర్యటన తాలూకు విశేషాలను, సమీక్షలో చర్చించిన అంశాలను మీడియా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు గోదా వరి జలాలను మొదటి దశలో జూన్‌లోగా అనకాపల్లి వరకు తీసుకెళతామని చెప్పారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు ఇప్పటివరకు 76 శాతం పూర్తయినట్లు చెప్పారు. జగన్ హయాంలో ఎక్కడి పనులు అక్కడే ఆపేయడం వల్ల ప్రగతిని 20 ఏళ్లు వెనక్కి నెట్టేశాడని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకి, కుడి, ఎడమ కాలువలకు భూములు, ఆస్తులు ఇచ్చిన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యమిస్తోందని వివరించారు. నిర్వాసితులకు జగన్ హయాంలో తీవ్ర అన్యాయం చేయగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో 2016, 2025లలో మొత్తం మూడు దఫాలుగా 2200 కోట్లు ఇచ్చి నిర్వాసితులను నిండు మనసుతో ఆదుకున్నారన్నారు. కుమ్మరిలోవ గ్రామంలోని 472 కుటుంబాలకు 30.3 కోట్లు నష్టపరిహారం అందించామని తెలిపారు.
వంతెనల నిర్మాణ పనుల పరిశీలన
అన్నవరం సమీపంలోని ఆరెంపూడి, గవరయ్య కోనేరు గ్రామాల దగ్గర హైవే క్రాసింగ్ వంతెనల నిర్మాణ పనులను పర్య వేక్షించారు. నేషనల్ హైవేల క్రాసింగ్ దగ్గర వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పనుల T ఆలస్యం చేస్తే, ఉపేక్షించేది లేదని అధికారులు, ఏజెన్సీలను హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చడంలో గోదావరి జలాలు ఎంతో కీలక మైనవిగా స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తరలించడానికి పోలవరం ఎడమ ప్రధాన కాలువే ఆధారం కనుక ఫస్ట్ పేజ్ పూర్తి చేయడం ఎంతో కీలకమని తెలిపారు. అనకాపల్లి కేంద్రంగా వస్తు న్న భారీ పరిశ్రమలకు సైతం నీటి సమస్య లేకుండా గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పూర్తి చేయడం ద్వారా కాలువ మొదటి నుంచి తుని వరకు ఉన్న 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు నిండి, 28,557 ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుందని వివరించారు.















