- ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహమే లక్ష్యం
- మెటా, అమెజాన్, జోహో వంటి సంస్థలతో డీల్
- డీప్ టెక్‌కు రూ.20 కోట్ల సిడ్బీ సీడ్ ఫండ్
- ఆర్‌టీఐహెచ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రోత్సాహం
అమరావతి(చైతన్యరథం): ఎంఎసఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 లో ఏపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేష న్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్తగా 38 ఎంఎస్ ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశా రు. అనంతరం రాష్ట్రంలో స్టార్టప్‌లు, ఎంఎసఎంఈలను ప్రోత్స హించేందుకు వివిధ సంస్థలు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందా లు కుదుర్చుకున్నాయి. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో నడిచే రూరల్ అవుట్ పోస్టులను కూడా సీఎం ఆవిష్కరించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ సెంటర్లను పైలట్‌గా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ కేం ద్రాలుగా ఈ ఆరఎస్వీ కేంద్రాలు పనిచేయనున్నాయి. ఆర్టీఐహెచ్ తో కలిసి కియా ఇండియా సంస్థ అడ్వాన్స్డ్ ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వివిధ స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేలా హైఎండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రోటో టైపింగ్ ఫెసిలిటీని కియా ఏర్పాటు చేయనుంది.
డీప్ టెక్ స్టార్టప్ లకు ఆర్థిక సహకారం అందించేలా ఆర్టీఐహెచ్‌తో కలిసి సిడ్బీ రూ.20 కోట్ల సీడ్ ఫండ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రారంభించనుంది. దీనికి సంబంధించి సిడ్బీ బ్యాంక్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో లక్ష మంది ఎంఎసఎంఈ డిజిటల్ మెచ్యూరిటీ అసెస్‌మెంట్‌లో భాగంగా వివిధ కళాశాలల్లో 50 డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫెసిలి టేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎంఎసఎంఈ డెవలప్ మెంట్ కార్పొరేషన్ – ఐటీ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. వీటితో పాటు వెయ్యి ఎంఎసఎంఈ ఎనర్జీ, వాటర్ ఆడిట్స్, ఎంఎసఎంఈ క్లస్టర్స్‌లో డయాగ్నోస్టిక్స్ నిర్వహించేందుకు ఎస్సెల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 750 ఎంఎసఎంఈలతో పాటు 3,125 మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా రూ.200 కోట్ల వ్యయంతో క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని నిర్ణ యించారు. దివ్యాంగ యువతకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టనున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లకు ఎంసఎంఈ ఉత్పత్తులు
రాష్ట్రంలోని 10 ఎంఎసఎంఈ క్లస్టర్లలో ఆయా రంగాల్లో జరిగే వృద్ధిని అధ్యయనం చేసేందుకు ఇండియా ఎసఎంఈ ఫోరంతో ఎంఎసఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. లక్ష ఎంఎసఎంఈలకు టెక్నాలజీ అడాప్షన్‌తో పాటు డిజిటల్ రెడీనెస్‌పై శిక్షణ కోసం వోడాఫోన్ ఐడీయా బిజినెస్‌తో ఒప్పందం కుదిరింది. ఎంఎసఎంఈల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం జోహో సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఎంఎసఎంఈ లు తయారుచేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విక్ర యాలకు, ఎగుమతులకు చేయూతనిచ్చేలా అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌తో ఒప్పందం కుదిరింది. లాజిస్టిక్స్ సపోర్టుతో పాటు క్రాస్ బోర్డర్ ట్రేడ్, ఎగుమతుల సామర్థ్యం పెంచేలా ఆరామెక్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఎంఎసఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
లక్ష మంది మైక్రో ఎంటర్‌ప్రైజెస్ సామర్థ్యాలను పెంచేలా మెటా సంస్థ చేయూత అందించేందుకు ఒప్పందం చేసుకుంది. తయారవుతున్న ఉత్పత్తు ల నాణ్యత సర్టిఫికేషన్, గ్లోబల్ ప్రమాణాలతో ఉత్పత్తి తదితర అంశాల్లో సహకారం అందించేందుకు క్యూసీఐ ముందుకు వచ్చిం ది. ఎంఎసఎంఈ సంస్థల్లో నేషనల్ పెన్షన్ వ్యవస్థ అమలు, ఆర్థిక వ్యవహారాలు, సామాజిక భద్రత అంశాల్లో తోడ్పడేందుకు పీఎఫ్ ఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డీబీవీ స్వామి సహా ప్రజాప్రతి నిధులు, ఎంఎసఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.
















