- 30 వేలమంది పుస్తెలు తెంచిన గొడ్డలి పార్టీ నాయకుడు జగన్
- సాంఘిక సంక్షేమ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆగ్రహం
మంగళగిరి (చైతన్య రథం): పాముపుట్టలోనుంచి బయటికి వచ్చినట్టుగా కుంభకోణాల్లో రోజుకొక గొడ్డలి పార్టీ నాయకుడి పేరు బయటికి వస్తుందని సాంఘిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. గత ఐదేళ్లలో ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యాన్ని పూర్తిగా ఆదాయ వనరుగా మార్చుకున్నారని వైసీపీని దుమ్మెత్తిపోశారు. శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మద్యం డిపోలనుంచి మద్యం దుకాణాలకు ఉన్న చార్జీలు రూ.13నుంచి రూ.35కు పెంచి రూ.400 కోట్లు దోచుకున్నారని, వాసుదేవరెడ్డిని బేవరేజ్ ఎండీగా చేసి రూ.3,500 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని జగన్‌పై మంత్రి స్వామి ఫైర్ అయ్యారు.
మద్యం కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పీఏ కేఎనఆర్ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడంటే అసలు లబ్ధిదారుడు జగన్ ఎంత దోచుకున్నాడో ప్రజలు అర్థం చేసుకోగలరన్నారు. కల్తీ మద్యం ద్వారా 30 వేల మంది ఆడపడుచుల పుస్తెలు తెంచినటువంటి నీకు ఆడపడుచుల ఉసురే తగిలిందనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోమని హెచ్చరించారు. చిన్నాన్నను చంపేసిన నీకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, వాళ్ల ప్రాణాలు లెక్కలేదని ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. దేశంలో ఎక్కడైనాగానీ విక్రయించే మద్యంలో ఆల్కహాల్ ఉంటుందని, కానీ జె-బ్రాండ్స్‌లో మాత్రం పైరోగలాల్, డై ఇథైల్ థాలేట్, ఐసోప్రొపిలిక్ యాసిడ్ వంటి హానికారక రసాయనాలు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతిచోటా వైసీపీ నాయకుల పాత్ర ప్రాధాన్యత ప్రజలకు అర్థమవుతోందని అన్నారు.
చెవిరెడ్డి దగ్గర నుంచి కారుమూరి నాగేశ్వరరావు, మిధున్ రెడ్డి వీళ్లందరిని ఈడీ ప్రశ్నిస్తుందంటే ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, గొడ్డలి పార్టీ నాయకుడైన సైకో జగనేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీని తీసుకొచ్చి నాణ్యమైన మద్యాన్ని ఇస్తున్నామని, ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ తీసుకొచ్చి మద్యం ఎక్కడైనా నకిలీ, కల్తీ జరగకుండా పారదర్శకంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
కారుమూరి నాగేశ్వరరావు సుదర్శన్ కన్స్ట్రక్షన్ సంస్థ పేరుతో రూ.15 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. 2023 డిసెంబర్ 16 తర్వాత కాట్పాడులని ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్‌కు రవాణా కాంట్రాక్ట్ అప్పించిన వాస్తవం కాదా? అని నిలదీశారు. ఈ సంస్థ ద్వారా కిలోమీటర్‌కు రూ.35.30 పైసలు (నెల్లూరు, కోస్తా), రూ.35.90 (ఉత్తరాంధ్ర) లెక్కన రవాణా చార్జీలు చెల్లించేలా కాంట్రాక్టు ఖరారు చేసుకొని దోపిడీ చేసిన వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన బ్రాండ్లు ఇవ్వడమే కాకుండా 3,396 మద్యం షాపులను లాటరీ పద్ధతిలో కేటాయించి పారదర్శకంగా నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తూ, పేదలను దృష్టిలో ఉంచుకొని రూ.99కే అంతర్జాతీయ, జాతీయ కంపెనీల మద్యాన్ని ఇస్తున్నామని తెలిపారు.
కల్తీ మద్యం ద్వారా వచ్చిన సొమ్ముతో బంగారు కొనుగోలు, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్, దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో షెల్ కంపెనీల ద్వారా తరలించడం, ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, వైసీపీ నాయకులు అక్రమ సొమ్మును పంచుకోవడం, ఇవన్నీ దర్యాప్తులో బయటకు రావడం వాస్తవమేనని మంత్రి అన్నారు. ప్రజా తీర్పులోనే మిమ్మల్ని ఇంటికి పంపించిన పరిస్థితి గుర్తు చేసుకోమని హెచ్చరించారు. తొందరలోనే తాడేపల్లి ప్యాలెస్‌కు కూడా మద్యం మూలాలు చేరతాయని హెచ్చరించారు.
జగన్ రెడ్డి సైకో వర్తన వల్ల రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి పోయిందని, చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో సుపరిపాలన ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి తెలిపారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని, రాష్ట్రంలో శాశ్వతంగా గొడ్డలి పార్టీని ప్రజలు మూసి వేశారని అన్నారు. దేశం, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి 90 శాతం స్ట్రైక్ రేట్‌తో గెలిపించారనే విషయాన్ని గొడ్డలి పార్టీ గుర్తు చేసుకోవాలని అన్నారు. మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే డీఎస్సీపై అసత్య ఆరోపణలు చేసి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని మంత్రి విమర్శించారు.














