- అమర్‌నాథ్‌గౌడ్‌ని బలిగొని మూడేళ్లు
- ఆ కుటుంబానికి అండగా ఉంటాం: లోకేష్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ అధినేత జగన్‌రెడ్డిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలపై గొడ్డలి పార్టీ కక్షగట్టిందని ధ్వజమెత్తారు. అమరావతి వేదికగా మంగళవారం మీడియాతో మంత్రి లోకేష్ మాట్లాడారు. తన అక్కను గొడ్డలి పార్టీ నేతలు వేధిస్తుంటే ప్రశ్నించినందుకు జూన్ 15, 2023న బడికి వెళుతున్న 15 ఏళ్ల బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్‌ను దారుణంగా కొట్టి కట్టేసి సజీవ దహనం చేశారని మండిపడ్డారు. నాడు గొడ్డలి పార్టీ నిందితులను రక్షించేందుకు ప్రయత్నించిందని ఆగ్రహించా రు. అన్యాయంగా అమర్‌నాథ్‌గౌడ్‌ని చంపేశారని.. బాలుడు మృతిచెంది మూడేళ్లు అవుతోందని తెలిపారు. జగన్ హయాంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాం లో బీసీలపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బీసీలు అంటే జగన్‌కు ఎంత కక్షో అమర్నాథ్‌గౌడ్ సజీవదహనం నిరూపించిందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా నష్టపోయిన అమర్నాథ్‌గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

















