- తప్పుడు ప్రచారం చేస్తే తోలు తీస్తాం
- నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి
- రెండున్నరేళ్ల కూటమి అభివృద్ధిపై చర్చకు సిద్ధం
- మీలా ఎవరినీ వేధించలేదు… రౌడీ షీట్లు తెరవలేదు
- నరుకుతామంటే ఎవరూ భయపడరు..
- వైసీపీ నాయకులకు మంత్రి సవిత హెచ్చరిక
- నెరవేరిన 50 ఏళ్ల ఉప్పరపల్ల వాసుల కల…
- రూ.3 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం
రొద్దం/ శ్రీసత్యసాయి (చైతన్య రథం): ‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేశాం. గ్రామాలు, పంచాయతీలు, మండలాలు, నియోజక వర్గాలు, రాష్ట్రం వారీగా ఏ స్థాయిలో అభివృద్ధిపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధికి సహకరిస్తే సహృదయంతో స్వీకరిస్తాం. నోరు అదుపులో పెట్టుకోకుండా అబద్ధాలు ప్రచారం చేస్తే తోలుస్తాం. ఖబడ్దార’ అని వైసీపీ నాయకులను రాష్ట్ర చేనేత జౌళి శాఖా మంత్రి సవిత హెచ్చరించారు. వైసీపీ నాయకులకు అభివృద్ధి చేతకాక ఐదేళ్లపాటు రాష్ట్రంలో అంధకారాన్ని నింపారన్నారు. కూటమి ప్రభుత్వం సాధిస్తోన్న అభివృద్ధికి ఓర్వలేకపోతున్నారన్నారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం అభివృద్ధితోపాటు సంక్షేమం అమలు చేస్తోందని, ప్రజలకు ఓటు అడిగే హక్కు తమకే ఉందని స్పష్టంచేశారు. కూటమి నాయకులు ఐక్యంగా పనిచేసి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించి, పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
రూ.1.47 కోట్లతో రొద్దం మండలం పెద్దమంతురు జిల్లా పరిషత్ హైస్కూల్‌నుంచి ఎల్ తిమ్మాపురం వరకు, చెరుకూరు నుంచి ఉప్పరపల్లి గ్రామానికి మరో రూ. 1.6కోట్లతో వేసిన బీటీ రోడ్లను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడారు. గత సాధారణ ఎన్నికల్లో తాను పూర్తిస్థాయిలో ప్రచారం చేయకపోయినా ఉప్పరపల్లి వాసులు అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. పెద్దమంతురు, ఉప్పరపల్లి గ్రామాలకు రోడ్డు వేస్తానని ఆనాడే మాటిచ్చానని, ఇచ్చిన మాటలకు కట్టుబడి రోడ్లు నిర్మించిన తరవాత గ్రామాలకు వచ్చానన్నారు. ఇవేకాక త్వరలో మరో మూడు రోడ్లు నిర్మించనున్నామన్నారు. రూ.13 కోట్లతో కోగిరి ఎత్తిలపోతల పథకం ప్రాజెక్టుకు భూమి పూజ చేయనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గంలో రూ.6.30 కోట్లతో తాగునీటి కల్పనకు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించబోతున్నామన్నారు. ఈ రెండు గ్రామాల్లోనూ 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి సవిత మండిపడ్డారు.
పంచాయతీల్లో గెలుపే నాకు రిటర్న్ గిఫ్ట్ ..
అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో సీఎం చంద్రబాబునాయుడు పరుగులు పెట్టిస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. సూపర్ సిక్స్ పథకాలతో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తల్లికి వందనం సహా ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రహదారులు, ఆసుపత్రుల నిర్మాణం, ఓవర్ హెడ్ ట్యాంకుల ఏర్పాటు చేపడుతున్నామన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు కేవలం కూటమి ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. కూటమి నాయకులు ఐక్యం పని చేసి, స్థానిక సంస్థల్లో పసుపు జెండా ఎగురవేసి, తనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
నోరుజారితే తోలు తీస్తా…
అయిదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నోచుకోలేదని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి జరిగిందని వివరించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. సూపర్ సిక్స్ సహా ఎన్నో పథకాలను అర్హులకు అందజేస్తున్నామన్నారు. త్వరలో కొత్త పెన్షన్లతోపాటు ఇళ్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది చూసి వైసీపీ వలస పక్షులు, ఆ పార్టీ నేతలు సహించలేకపోతున్నారని విమర్శించారు. వారు అభివృద్ధిపై సూచనలు చేస్తే సహృదయంతో స్వీకరిస్తామని, తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని, తోలుస్తాం… ఖబడ్డార్ అని మంత్రి సవిత హెచ్చరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ ఏ స్థాయిలోనైనా అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే రావాలని మంత్రి సవిత సవాల్ విసిరారు.
మీలా రౌడీ షీట్లు తెరవలేదు…
జగన్ అయిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురైందని మంత్రి సవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ప్రభుత్వ వైఫల్యాన్ని నిలదీస్తే, తమపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వైసీపీలా ఏనాడూ రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టడం, రౌడీ షీట్లు ఒపెన్ చేయడం వంటి దిగజారుడు చర్యలకు పాల్పడలేదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమంటూ ఆ పార్టీ నాయకులు చేస్తున్న ధర్నాలను, ఆందోళన కార్యక్రమాలను అడ్డుకోలేదన్నారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సవిత స్పష్టంచేశారు.
నరుకుతామంటే ఎవ్వరూ భయపడరు…
రప్పా…రప్పా…అని నరుకుతామంటే గొడ్డలి పార్టీ నాయకులు బెదిరింపులకు ఎవరూ భయపడరని మంత్రి సవిత స్పష్టంచేశారు. రప్పా రప్పా నరికితే తప్పేంటని జగన్ అనలేదా… ప్లెక్సీలు పెట్టించి గొడ్డళ్లతో బెదిరింపులకు పాల్పడలేదా..? అని ప్రశ్నించారు. ఓటు అనే ఆయుధం కలిగిన ప్రజలు ఎవరికీ భయపడరన్నారు. వారు బాగు కోసం పనిచేసేవారికే ఓట్లేసి గెలిపిస్తారన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రజలకే తాము తలొగ్గుతామని, మరెవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని మంత్రి సవిత తేల్చి చెప్పారు.
నెరవేరిన 50 ఏళ్ల కల…
రొద్దం మండలం ఉప్పరపల్లి గ్రామానికి 50 ఏళ్ల నుంచి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆ గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. గత సాధారణ ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారానికి మంత్రి సవిత దృష్టికి ఉప్పరపల్లి గ్రామస్తులు తమ అవస్థలను వివరించారు. రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల తమ బిడ్డలు విద్యకు దూరమవుతున్నారని, పండిన పంటను మార్కెట్ కు తీసుకెళ్లి విక్రయించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. చివరికి తమ ఊరి బిడ్డలకు పిల్లనివ్వడానికి ముందుకు రావడానికి సందేహిస్తున్నారని వాపోయారు. ఉప్పరపల్లి వాసుల కష్టాలు విన్న మంత్రి సవిత… రోడ్డు నిర్మించిన తరవాతే గ్రామానికి వస్తానని ఆనాడు మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, బీటీ రోడ్డు నిర్మించడంపై ఆ గ్రామస్తుల ఆనందానికి అవధ్లుల్లేకుండాపోయింది. మాట నిలబెట్టుకున్న మంత్రి సవితకు ఘన స్వాగతం పలికి తమ ఆనందాన్ని తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.















