- విశాఖ కేంద్రంగా పాలన పేరుతో జగన్‌రెడ్డి కొత్త కుట్ర
- మూడు సార్లు ముహూర్తాలు మార్పు
- ఎన్నికలకు మూడునెలల ముందు విశాఖకు
- నాలుగున్నరేళ్లుగా ఉత్తరాంధ్ర గుర్తుకురాలేదా?
- ఎన్నికల లబ్ధి కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం
- ఇప్పటి వరకు లక్షల కోట్ల ఆస్తుల దోపిడీ
అమరావతి, చైతన్యరథం: నిన్నటి వరకు దసరా నుండి విశాఖ కేంద్రంగా పనిచేస్తానని ఊదరగొట్టిన సిఎం జగన్‌రెడ్డి మరోసారి మాటమార్చి డిసెంబర్‌లో వెళ్తున్నానని ప్రకటించారు. అసలు రాజధానిని మార్చ డానికి హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఒప్పుకోనప్పటికీ తన రాజకీయ పబ్బం గడపుకోవడానికి ఉత్తరాంధ్రను ఒక పావుగా వాడుకునేందుకు తాజాగా విశాఖ కేం ద్రంగా పాలన అనే కొత్త కుట్రకు తెరలేపారు. నాలు గున్నరేళ్ల పాటు కుంభకర్ణుడి మాదిరి నిద్రలో ఉన్న జగన్‌రెడ్డికి ఒక్కసారిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి గుర్తుకు వచ్చింది. ఎన్నికల సమయంలో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకే విశాఖ నుండి పాలన అనే నినాదాన్ని ఎంచుకున్నారు. అధికారికంగా విశాఖ నుండి పాలన చేయడానికి కోర్టులు అనుమతించక పోవడంతో సిగ్గు విడిచి దొడ్డిదోవన ఉత్తరాంధ్ర నుండి పాలన అంటూ జీవోలు ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పై జగన్‌రెడ్డికి ఎటువంటి చిత్తశుద్ది లేదు. ప్రజలను, వారి ఆస్తులను లూటీ చేసి, వారిపై పన్నుల భారం మోపి పూర్తిగా పాలన పరంగా పాపర్‌గా మారిన జగన్ రెడ్డి ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త ఎత్తుగడ వేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని ఆటకెక్కెంచి విశాఖలో భూదందా చేసుకునేందుకు మూడు రాజధా నులు అంటూ ప్రకటనచేసి రాష్ట్ర అభివృద్ధికి శరాఘా తంగా మారిన జగన్‌రెడ్డి విశాఖ కేంద్రంగా పాలన అంటూ ఇప్పటికి మూడు ముహుర్తాలు మార్చారు. ముందుగా ఉగాదికి వెళ్తానన్నాడు. ఆ తర్వాత కాదు దసరా అన్నాడు. ఇప్పుడు తాజాగా డిసెంబర్ నుండి విశాఖలో కూర్చుంటాను..అధికారులు కూడా అక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సమీక్షలు చేయాలని అంటున్నారు. అయితే విశాఖనే పరిపాలనా రాజధాని అని చెప్పే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా? ఎన్నికల్లో ఎటూ ఓడిపోతానని భావించిన జగన్‌రెడ్డి తాను ఆడుతున్న క్రూరమైన ఆటలో ఉత్తరాంధ్రను పావుగా ఎంచుకున్నా రు. జగన్‌రెడ్డి గ్యాంగ్ అంటేనే బెదిరిపోతూ వైసిపి నేతలను చీదరించుకుంటున్న ఉత్తరాంధ్రపై కొత్తగా ఎన్నికల ప్రేమ ఒలకపోస్తున్నారు. డిసెంబర్ అంటే ఎన్నికలకు మరో మూడు నెలలే ఉండేది. ఈ మూడు నెలల్లో ఉత్తరాంధ్రకు ఎటువంటి అభివృద్ధి వస్తుంది. ఇది పూర్తిగా ఎన్నికల జిమ్మిక్కు. ఇది కేవలం జగన్ రెడ్డికి దింపుడు కల్లం ఆశలే! విశాఖకు రాజధాని మార్చడం సాధ్యం కాదని తెలిసి అక్కడి ప్రజల్లో భావోద్వేగాలు పెంచి కలిసిమెలిసి ఉంటున్న ఏపీ ప్రజ ల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అమ రావతి నుంచి ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిన నేపథ్యంలో జగన్‌రెడ్డి చేస్తున్న ఈ కుట్ర కోర్టుల్లో అసలు నిలబడగలదా అనేది సందేహామే.
దోచుకునేందుకే విశాఖపై కపట ప్రేమ
విశాఖలో కార్యానిర్వాహక రాజధాని అంటూ ప్రచా రం చేసి, అక్కడ నుండే పాలన చేసేందుకు ఇప్పుడు వెళ్తున్నాను..అప్పుడు వెళ్తున్నాను అంటూ మీడియాలో వార్తలు రాయించి ముందే అక్కడ కొనిపెట్టుకున్న భూములకు రేట్లు పెంచుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడన్నరేళ్లలో 72వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 42వేల ఎకరాలు చేతులు మారాయి. జగన్‌రెడ్డి గ్యాంగ్ లక్షల కోట్ల ప్రజల ఆస్తులను లూటీ చేశారు. గత నాలుగేన్నరేళ్లలో జగన్‌రెడ్డి విశాఖను అభివృద్ది చేయడం కన్నా అప్పటికే ఉన్న ఆస్తులను ఎలా కాజేయాలన్న దానిపైనే దృష్టి పెట్టారు. అప్పటికే విశాఖ కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు. ఉత్తరాంధ్రకు తలమానికమైన రుషికొండను బోడి గుండు చేశారు. దసపల్లా భూముల్లో విజయసాయిరెడ్డి తన బినామీలతో రూ.3 వేల కోట్లు దోపిడీ చేశారు. ఎన్‌సిసికి ఇచ్చిన భూమి ఖరీదైన రుషికొండ ఐటి హిల్ దగ్గర 65 ఎకరాలు ఎ-2 అల్లుడు సంస్థకి కట్టబెట్టారు. బీచ్ రోడ్డులోని బే పార్కులో రూ.225 కోట్ల విలువైన 9ఎకరాలు ఎ-1 బినామీ హెటిరోకి సమర్పించారు. రుషికొండ ఐటి హిల్ రేడియంట్ డెవలపర్ కి ఇచ్చిన 52 ఎకరాలను వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కట్టబెట్టారు. ఆర్.కె.బీచ్ రోడ్డులో లులూ కోసం సేకరించిన 5 ఎకరాల ప్రైవేటు భూమి, ఎపిఐఐసికి సంబంధించిన 8 ఎకరాలను సొంత వారికి కట్టబెట్టి దోచుకున్నారు. రాంకీ అయోధ్య రామిరెడ్డికి షీలానగర్ వద్ద 28 ఎకరాల భూమి కట్టబెట్టి 800 అపార్ట్ మెంట్లు, 100 విల్లాల నిర్మాణాన్ని ప్రారంభించారు. కార్తీక వనాన్ని వాటాలు వేసి పంచుకున్నారు.గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టి అందులోనూ కమిషన్లు దండుకు న్నారు. బీసీలు అధికంగా ఉన్న ఉత్తరాంధ్రపై విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని నియమించి పెత్తనం చేస్తున్నారు. విజయసాయిరెడ్డికి కాకినాడ పోర్టు, సెజ్ దారాదత్తం చేశారు.వై.వి.సుబ్బారెడ్డికి విశాఖ మన్యంలో లేటరైట్, బాక్సైట్ మైనింగ్ దోపిడీకి అడ్డగోలుగా అనుమతులిచ్చారు. ఎంపీ విజయసాయి‘రెడ్డి’ ఉత్తరాంద్రకు సామంత రాజుగా నియమించి.. నాలుగున్నరేళ్లలో సుమారు రూ.40వేల కోట్ల విలువైన ప్రజల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఇప్పుడు జగన్ రెడ్డి తన చిన్నాన్న వై.వి.సుబ్బారెడ్డితో ఉత్తరాంధ్రకు సామంత రాజుగా నియమించి మిగిలిన ఆస్తుల్ని కూడా స్వాహా చేసే ప్రయత్నానికి తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశానికి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారు. పెద్ద జాలారిపేటలో ఎప్పటినుండో పేదలు ఉంటున్న భూములకు వారసులు మేమంటూ పట్టాలు పుట్టించి రెండు వేల కోట్ల రూపాయలను టిడిఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వం నుండి కొట్టేసేందుకు జగన్‌రెడ్డి గ్యాంగ్ పక్కగ ప్లాన్ చేసింది. ఇలా చెప్పుకుంటే పోతే విశాఖలో జగన్ రెడ్డి గ్యాంగ్ జరిపిన భూదందాలు అన్ని ఇన్నీ కావు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఇదేనా?
నిజంగా జగన్‌రెడ్డికి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ది ఉంటే ఆ ప్రాంతానికే మకుటాయమానంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎందుకు రక్షించలేకపోతున్నారు? పైగా స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేసి దాని భూములను అమ్ముకోవాలనుకునే కుతంత్రానికి ఎందుకు తెరలేపారు? విభజన హామీల్లో ఒకటైన విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఇంతవరకు ఎందుకు సాధించలేకపోయారు? విశాఖ మెట్రో ఇప్పటి వరకు పట్టాలు ఎక్కకపోవడానికి కారణమేంటి? విశాఖకు కేటాయించిన పెట్రోలియం వర్శిటీని తరిలిస్తుంటే ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? భోగాపురం ఎయిర్‌పోర్టు, ట్రైబల్ యూనివర్శటీ ఏర్పాటులో ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు పడడం లేదు? ఉత్తరాంధ్రకు ఉపాధి అవకాశాలు కల్పించే ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్, లూలూ సంస్థలను ఎందుకు తరిమికొట్టారు? కీలకమైన 13 ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తేవడం అభివృద్ధా? ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదు? బాహుదా-నాగావళి-వంశధార-జంరaావతి అనుసంధానం ఏమైంది? వంశధార ఫేజ్-2, స్టేజ్-2 పనులు ఎందుకు పడకేశాయి? కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం ఎందుకు పూర్తి చేయడం లేదు? ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనుల్ని ఎందుకు నీరుగార్చారు? ఉత్తరాంధ్రలో కీలకమైన షుగర్ ఫ్యాక్ట రీలు ఎందుకు ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతు న్నాయి? ఉత్తరాంధ్రుల ఇలవేల్పు రామతీర్ధం రాముని శిరచ్చేధం నిందితులను పట్టుకోలేదు ఎందుకు?
మిలీనియం టవర్స్ ఖాళీ చేయించి ఐటీ పరి శ్రమల్ని ఎందుకు తరిమేశారు? బే పార్క్ భూములు హెటిరోకు కట్టబెట్టడం క్విడ్ ప్రో కో కాదా?
రుషికొండ ఐటీ హిల్ 52 ఎకరాల రేడియంట్ భూముల్లో జగన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డికి కట్టబెట్టింది నిజంకాదా? షీలా నగర్లో అత్యంత విలువైన 28 ఎకరాలను అత్యంత చౌకగా రాంకీకి కట్టబెట్టడం నిజం కాదా? భోగాపురం ఎయిర్ పోర్టుకు చెందిన 500 ఎకరాలు దోచేయడం వాస్తవం కాదా?
పోలవరం పూర్తి చేయకపోవడమంటే.. విశాఖలో దాహార్తి పెంచడం కాదా? భీమిలి`భోగాపురం బీచ్ కారిడార్ ఉద్దేశ్యపూర్వకంగా నిలిపేయడం నిజం కాదా?
మధురవాడలో రూ.1700 కోట్ల విలువైన 97.3 ఎకరాలను కేవలం రూ.187 కోట్లకే మంత్రి కొట్టు సత్యన్నారాయణ సోదరుడికి చెందిన %GRూూ% సంస్థకు కట్టబెట్టడంలో క్విడ్ ప్రో కో లేదా? నర్సీపట్నం నియోజకవర్గం, మాకవరపాలెంలో 76 ఎకరాలు కబ్జా చేయడం నిజం కాదా?
వాల్తేరు క్లబ్ భూముల స్వాహాకు కుట్ర చేయడం వాస్తవం కాదా? మాన్సాస్ ట్రస్టును ఆక్రమించడం వేల ఎకరాల భూముల దోపిడీ కుట్ర కాదా?
విశాఖను దేశానికి గంజాయి కేపిటల్ గా మార్చడమా ఉత్తరాంధ్రపై చూపే ప్రేమ? ఈ ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే దమ్ము జగన్‌రెడ్డికి లేదు. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ది పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు.