యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు. నీళ్లలోకి దిగి కృష్ణమ్మకు హారతి ఇచ్చి పసుపు, కుంకుమ, చీరను సమర్పించారు. జలహారతి ఇచ్చే ప్రదేశం వద్ద గిరిజన మహిళలు, చిన్నారులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టి పాటిరవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రాద్, పార్ధసారధి, ఎంపీ శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.